చిలిపిచెడ్, సెప్టెంబర్ 25 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు ఎస్సై నర్సింలు తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు శశికళ, లక్ష్మి, ప్రమీల తదితరు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం కోసం సెక్రటేరియల్ ధర్నా చేయడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించినట్లు తెలిపారు.
ప్రభుత్వాలు మారిన మా బతుకులు మారడం లేదని వెట్టిచాకి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా నెలకు రూ. 18 వేలు, వేతనం, పీఎఫ్ అమలు చేయాలి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని.. ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్ ను నియమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.