Rayapole | రాయపోల్, మార్చి 27 : భారత ఆర్మీ నిర్వహించిన సోల్జర్ రిక్రూట్మెంట్లో రాయపోల్ మండలం అనాజీపూర్ యువకుడు ఎంపికయ్యాడు. 2024 డిసెంబర్ 20న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫలితాలు గురువారం వెలువడగా అనాజీపూర్ గ్రామానికి చెందిన బెస్త వరుణ్ ఎంపిక అయ్యాడు. వరుణ్‌ను కుటుంబ సభ్యులతోపాటు రిటైర్డ్ సైనికుడు నీలచంద్రం అభినందించారు. వరుణ్‌కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.