మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 11: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును సెప్టెంబర్ 9వరకు పొడిగించబడిందని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా ఇంటర్‌కు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, అనంతరం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ అభ్యాసన కేంద్రంలో సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేసి అడ్మిషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి ప్రవేశం పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం యూనివర్శిటీ వెబ్సైట్ www.braouonline.com సందర్శించాలన్నారు. లేనిచో కళాశాల అంబేద్కర్ అభ్యాసన కేంద్రం కో ఆర్డినేటర్ తిరుమల్‌రెడ్డిని (7382929698) సంప్రందించాలన్నారు.