నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ముగ్గురు అనుమానితులను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ విగ్రహ దాడిపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.