రాయపోల్, జూన్ 14: దౌల్తాబాద్ (Daulatabad) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కాలేజీకి చెందిన అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. మండల పరిధిలోని, హైస్కూల్ ఉన్న ప్రతీ గ్రామాన్ని అధ్యాపకులు సందర్శించి అడ్మిషన్లు చేస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది కంటే 30 శాతం పెంచాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. గత సంవత్సరం 136 అడ్మీషన్లు కాగా ఈ ఏడాది 30 శాతం ఎక్సెస్ కలిపి మొత్తం 150 అడ్మిషన్ల టార్గెట్ను పూర్తి చేయడానికి అధ్యాపకులు ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అధ్యాపకుల సమన్వయంతో ఈ సంవత్సరం కచ్చితంగా సెక్రటరీ ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ మధుశీవాత్సవ తెలిపారు.