మెదక్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఏండ్లుగా తిరుగుతున్నా..భూసమస్య పరిష్కరించడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి సోమవారం హల్చల్ చేశాడు. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ కొన్నేండ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిషారం కావడంలేదని కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కాడు. పైనుంచి దూకుతానని అరగంట పాటు హల్ చల్ చేశాడు. అక్కడ ఉన్న సిబ్బంది, విలేకరులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కస్తామని నచ్చజెప్పడంతో సురేందర్ కిందకు దిగాడు.
అనంతరం సురేందర్ మాట్లాడుతూ.. శమ్నాపూర్‌లో తన తండ్రి రమేశ్ పేరు మీద 18 గుంటల భూమి ఉండగా, అందులో 3 గుంటలు తల్లి పేరున మార్చారు. 15 గుంటల భూమి తన తండ్రి పేరు మీద పట్టా ఉండగా ధరణిలో ఆధార్ కార్డు తనది ఎంట్రీ కావడంతో రైతుబంధు, పీఎం కిసాన్ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యను పరిషరించాలని అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చినా లాభం లేదన్నాడు. ఇటీవల హవేళీఘనపూర్ తహసీల్దార్ వద్దకు వెళ్లి సమస్య పరిషరించాలని అడగ్గా, ఆ విషయం తమకు సంబంధం లేదని సమాధానమిచ్చారని తెలిపారు.
దీంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చానని తెలిపాడు. అయితే అధికారులు దరఖాస్తును టేబుల్ మీదే వదిలేసి వెళ్లారని చెప్పాడు. ఆ దరఖాస్తు తీసుకొని డీఆర్వో వద్దకు వెళితే ఆయన దరఖాస్తు పకకు విసిరేసి, చస్తే చావు బతికితే బతుకు అన్నారని సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చస్తే అయినా భూ సమస్య పరిషారం అవుతుందేమోనని కలెక్టరేట్ భవనం ఎకినట్లు తెలిపాడు. అదనపు కలెక్టర్ నగేశ్ బాధితుడిని పిలిపించుకుని మాట్లాడాడు. హవేళీఘనపూర్ తహసీల్దార్‌ను, ధరణి ఆపరేటర్‌ను పిలిపించి మాట్లాడి సమస్య పరిషారానికి చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.