సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 7: జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు నియమించిన పరిశీలకులతో శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో 16 పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొ త్తం 9,672 మంది అభ్యర్థులు పరీక్షకు హాజ రు కానున్నారని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రా లు, హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబరు 08455276155పై సంప్రదించాలని సూ చించారు. హాల్ టికెట్‌ను http://www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాస్ పో ర్ట్, ఓటరు ఐడీ కార్డు ఇతర ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
సంగారెడ్డి, జూన్ 7 : ఉద్యోగాల ఎంపికకు ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిందని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న జరుగనున్న గ్రూప్-1 పరీక్షకు అవసరమైన కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారన్నారు.
అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌కు పాల్పడరాదని సూచించారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు ఉంటుందని, పోలీసు చట్టాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్టీసీ అధికారులు ప్రతి కేంద్రం వరకు బస్సులు నడుపుతున్నారన్నారు.