చేర్యాల, మే 29 : పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ షాపులను బుధవారం వ్యవసాయ, పోలీస్‌శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.పట్టణంలోని రాజరాజేశ్వర ఫర్టిలైజర్ షాపులో పత్తి వితన ప్యాకెట్లను అధికారులు పరిశీలించారు. ప్యూచర్ క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అన్నదాత ఎంటర్‌ప్రైజేస్‌లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ రాధిక, సీఐ శ్రీను మాట్లాడుతూ డీలర్లు నాసిరకం విత్తనాలు అమ్మకూడదని, అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.ఎరువులను కృత్రిక కొరత సృష్టించవద్దని, గ్రామాల్లో లూజ్ పత్తి విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.కార్యక్రమంలో వ్యవసాయశాఖ మండల అధికారి ఆఫ్రోజ్, ఎస్సై దా మోదర్, సిబ్బంది పాల్గొన్నారు.
హుస్నాబాద్‌టౌన్, మే 29: నకిలి విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలని ఏఈవో శివారామ్ సూచించారు. హుస్నాబాద్‌లో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు కొనేటప్పుడు రసీదు తీసుకోవాలని, అధిక ధరలకు కొనవద్దన్నారు. ప్యాకెట్కాకుండా లూజ్‌గా ఎవరు కూడా విత్తనాలను తీసుకుని మోస పోవద్దని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రైతులు గురా ల సంజీవరెడ్డితోపాటు పలువురు ఉన్నారు.
దుబ్బాక,మే 29: గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయించేందుకు వచ్చే వ్యాపారులను నమ్మి మోసపోవద్దని మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ రైతులకు సూచించారు. దుబ్బాక మండలం కమ్మర్పల్లి, హబ్షీపూర్ తదితర గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తన కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆనంతరం దుబ్బాక పట్టణంలో ని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశా రు. ఏఈవోలు సంతోష్‌కుమార్, హరీశ్‌కుమార్, మహేష్, చైతన్య, అస్మాపాల్గొన్నారు.
బెజ్జంకి, మే 29: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, విత్తన్న విక్రయ దుకాణాల్లో వ్యవసాయశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతం గా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి ఉన్న కంపెనీ ధ్రువపత్రాలు, బిల్లులు, రికార్డుల నిర్వహణ, నిల్వలను పరిశీలించారు. కాలం చెల్లిన విత్తనాలు, మందులను గమనిస్తూ దుకాణం నుంచి తొలిగించాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి సంతోష్‌కుమార్, ఏఎస్సై శంకర్రావు, ఏఈవో సాయిశంకర్ పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), మే29: నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు మద్దూరు ఎస్సై షేక్ యునూస్అహ్మద్అలీ అన్నారు. మద్దూరు మండల కేంద్రంతో పాటు రేబర్తి, ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలోని ఫర్టిలైజర్ షాపులను ఏవో రామకృష్ణతో కలిసి ఆయన తనిఖీ చేసి, రిజిస్టర్‌తో పాటు, స్టాక్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాకేశ్, కల్పన పాల్గొన్నారు.
కొమురవెల్లి, మే 29 : కాలం చెల్లిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏవో నరేశ్, హెడ్ కానిస్టేబుల్ బాబు అన్నారు. మం డల కేంద్రంలో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
కొండపాక,మే 29: మండలంలో పోలీసులు, వ్యవసాయాధికారులు విత్తన దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సిద్దిపేట త్రీటౌన్ ఎస్సై సూర్యనారాయణ, ఏవో ప్రియదర్శిని మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, మర్పడగ, సిర్సినగండ్లలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, నోటీస్ బోర్డు, లైసెన్స్ తదితర వాటిని పరిశీలించారు.
హుస్నాబాద్, మే 29 : విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఏడీ మహేశ్ హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో స్థానిక ఎస్సై మహేశ్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజురెడ్డి పాల్గొన్నారు.