రామాయంపేట, జనవరి 7 : గిరిజనులు గుడుంబా, ఇతర మత్తుపదార్థాలను తయారు చేస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి రాంరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట మండలంలోని కాట్రియాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్ తదితర తండాల్లో టాస్క్ఫోర్స్ బృందంతో తనిఖీలు చేపట్టారు. అనంతరం గిరిజనులకు మత్తు పదార్థాల తయారీ, నిషేధంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో గిరిజనులకు పెద్దపీట వేస్తు న్నదని, అనవసరంగా గుడుంబాను తయారు చేసి, కేసుల్లో పేర్లను నమోదు చేసుకోవద్దని సూచించారు.
ఉపాధిహామీ పనులను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. సారా తయారు చేస్తే జైలు కు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. తండాల్లో ఇండ్లతోపాటు గా పశువుల కొట్టాలు, బోరుబావుల వద్ద తనిఖీలు చేపట్టారు. దా డుల్లో రామాయంపేట ఎకైజ్ ఎస్సై విజయ్సిద్దార్థతోపాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై విశ్వనాథ్, సిబ్బంది రజిత ఉన్నారు.