ములుగు, నవంబర్ 24: ట్రాక్టర్ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ఈనెల 21న పొలంలో ఉంచిన ట్రాక్టర్ కనిపించడంలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి జీపీఎస్ ఆధారంగా ట్రాక్టర్ ఉన్న చోటును గుర్తించి నిందితులైన యాదాద్రి భువననగిరి జిల్లాకు చెందిన చెరుకుపల్లి రవీందర్‌రెడ్డి, అలమైన మల్లేశ్, ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అన్నెబోయిన నాగరాజు, పల్లె ప్రవీణ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. వారి నుంచి రెండు ట్రాక్టర్లు, కారు, ద్విచక్ర వాహనం, రూ. 45 వేల నగదును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ తరలించినట్లు ములుగు ఎస్సై విజయ్‌కుమార్, గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు.