Missing | నర్సాపూర్, సెప్టెంబర్ 9: తల్లి ఇద్దరు పిల్లలు అదృశ్యమైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం కథనం ప్రకారం మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన మాణిక్య రాజుకు సికింద్రాబాద్ బాలాజీనగర్‌కు చెందిన పుట్నల భవాని(26)తో గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు మాణిక్య లోకేశ్వరి(4.5), బాబు మాణిక్య అనిరుధ్(1.5).
Missingwoman
గత 5 నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడి భవాని వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. సోమవారం నాడు భవానిని వారి కుటుంబ సభ్యులు నారాయణపూర్ తీసుకువచ్చి నచ్చజెప్పి రాజు వద్ద వదిలేసి వెళ్లారు. మంగళవారం నాడు తన కొడుకు అనిరుధ్‌కు ఆరోగ్యం బాగాలేదని భార్యాభర్తలు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి రావడం జరిగింది. రాజు దావాఖానాలో వారిని వదిలేసి తను నడుపుతున్న ఆటోను తీసుకొని వెళ్ళిపోయాడు. తన భార్య భవాని ఓపీ చిట్టి తీసుకొని వస్తానని చెప్పి పిల్లలతో కలిసి వెళ్ళి తిరిగి రాలేదు. తన భార్యాపిల్లల గురించి చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికిన ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.