జహీరాబాద్, జూన్ 3: తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు డబ్బులు వృథాగా ఖర్చు చేయకుండా సామాజిక సేవ చేసి నిరుపేదలను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హారీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ నామరవికిరణ్ నిరుపేదకు ఇల్లు నిర్మించి అందజేశారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డిపల్లి కాలనీలో ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డెర రాములు సరైన ఇల్లు లేదు. వీరు నివసించే గూడులో కనీస సౌకర్యం, రాత్రుళ్లు కరెంట్ లేకుండా దీపం పెట్టుకుని దీన స్థితిలో ఉంటున్నారు.
వీరి పరిస్థితి చూసి చలించిన బీఆర్ఎస్ నాయకుడు నామ రవికిరణ్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. నామ సుబద్రమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో అన్ని వసతులతో రాములుకు ఇంటిని నిర్మించాడు. మంగళవారం హరీశ్‌రావు పుట్టినరోజును పురస్కరించుకొని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు చేతుల మీదుగా ఆ ఇంటిని ప్రారంభించి ఇంటి తాళాన్ని అందజేశారు. అక్కడే హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కేక్ కట్‌చేసి వడ్డెర రాములుకు తినిపించారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు నామ రవికిరణ్ దంపతులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అభినందించారు. మంచి కార్యక్రమం చేపట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండప్ప, మోహన్, యాకూబ్, అబ్దుల్లా, శివప్ప, అనుసమ్మ, మంజుల, పద్మజా, నరేశ్‌రెడ్డి, వెంకటేశం గుప్తా, గణేశ్, సందీప్, నిఖిల్, ఇబ్రహీం పాల్గొన్నారు.