Medak | మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హవేలిఘన్‌పూర్ మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వాడి గ్రామానికి చెందిన జగన్నాథం(50) సోమవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. బోర్వెల్ మోటార్లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. దాన్ని సరిచేసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ సంభవించింది. దీంతో విద్యుత్ తీగలు తగిలి రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని బోరున విలపించారు. జగన్నాథంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.