కోహీర్, సెప్టెంబర్10: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి పీఎస్ ఆవరణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గం జాయి స్వాధీనం వివరాలను ఆయన వెల్లడించారు. చిరాగ్పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డితో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి మాడ్గి గ్రామ శివారులోని ఆనంద్దాబా వద్ద 65వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారన్నారు.
కర్ణాటకలోని బాల్కికి చెం దిన లఖణ్, సిద్దిరామ్ కలిసి హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న క్రమంలో బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారని చెప్పారు. అందులో 140కిలోల ఎండు గంజాయిని ముంబయి, పూణెకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారని వెల్లడించారు.
గంజాయి విలువ రూ.35లక్షల వరకు ఉం టుందని, వాహనంతోపాటు లఖణ్, సిద్దిరామ్ను అరెస్ట్ చేశామన్నారు. అక్రమ రవాణాకు సహకరించిన మల్గొండ, రాహుల్, కిరణ్, సునిల్, మల్లేశ్‌నాయక్ పరారీలో ఉన్నారని తెలిపారు. 140కిలోల గంజాయితోపాటు బొలెరో, రెండు సెల్ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను సిజ్ చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ శివలింగం, పలు విభాగాల ఎస్సైలు రమేశ్, విజయ్, మహేశ్, శ్రీకాంత్, రాజేందర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.