నారాయణఖేడ్, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం జి.హు క్రానా గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన వార్డు సభ్యుడు బారి శంకర్, మాజీ వార్డు సభ్యుడు రాములు, నాయకులు దశరథ్, లక్ష్మ య్య, శివకుమార్, నవీన్‌కుమార్‌కు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు రవీందర్‌నాయక్, మండల కో-ఆప్షన్ సభ్యుడు నవాబ్ ఉన్నారు.
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో ..
వట్పల్లి, అగస్టు 22: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్లో చేరుతున్నరని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండల పరిధిలోని పోతులబోగుడలో పుల్కల్ మండలంలోని మునిమాణిక్యం గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్, పలువురు వార్డు సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమేశ్, బీఆర్ఎస్నేతలు పాల్గొన్నారు.