ఎస్ఐఆర్తో 2.98 లక్షల ఓట్ల కట్
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఎస్ఐఆర్ ప్రక్రియతో సంగారెడ్డి జిల్లాలో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది.
- 14.57 లక్షల ఓటర్లకు 11.59 లక్షల ఓటర్ల డిజిటలైజేషన్
- జిల్లా నుంచి 1,59,376 ఓటర్ల శాశ్వత వలస
- 54135 జాడలేని ఓటర్లు, 36530 నకిలీ ఓట్లు, జిల్లా అంతటా 40962 మంది ఓటర్లు మృతి
- పటాన్చెరులో అత్యధికంగా 1.36 లక్షల ఓట్లు కోత
సంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఎస్ఐఆర్ ప్రక్రియతో సంగారెడ్డి జిల్లాలో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 14,57,436 మంది ఓటర్లు ఉన్నా రు. ఎన్నికల కమిషన్ గత జూన్ 25 నుంచి ఈనెల 10వ తేదీ వరకు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టింది.
4,57,436 మంది ఓటర్లకు 11,59,158 మంది (79.53%) ఓటర్ల ఎన్యుమరేషన్ దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. ఎస్ఐఆర్ ప్రకియ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,36,579 మంది ఓటర్లకుగాను 2,08,225 మంది ఓటర్లు,అందోల్‌లో 2,55,084 మంది ఓటర్లకుగాను 2,22,581, జహీరాబాద్‌లో 2,82,398లో మంది ఓటర్లకు 2,31, 891 మంది తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో 2,54,693 మంది ఓటర్లకు 2,04,681 మంది ఓటర్లు, పటాన్చెరు నియోజకవర్గంలో 4,28,682 మంది ఓటర్లకు 2,91,780 మంది ఓటర్లు తమ ఓటర్లను నమోదు చేసుకున్నారు.
జిల్లాలో 2.98 లక్షల ఓట్లు కట్
ఎస్ఐఆర్ ప్రక్రియతో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 1,36,902 ఓట్లు తొలగనున్నాయి. అధికారుల సమాచారం మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో 2,98,278 మంది నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో అత్యధికంగా 1,59,376 మంది ఓటర్లు జిల్లాకు చెందిన ఓటర్లు తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అలాగే జాడలేని ఓటర్లు 54,135 మంది, నకిలీ ఓటర్లు 36530 మంది, మృతిచెందిన ఓటర్లు 40962 మంది ఉన్నారు. దీంతో వీరి ఓట్లు పూర్తిగా ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నాయి.
పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 1,3 6, 902, నారాయణఖేడ్‌లో 28,354, అందోల్‌లో 32,50 3, జహీరాబాద్‌లో 50,507, సంగారెడ్డిలో 50,0 12 మంది ఓటర్లు జిల్లా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోనున్నారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 82,918 మంది ఓటర్లు ఉన్నా రు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తరభారత దేశంలోని బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఓరిస్సా తదితర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన ఓటర్లు ఉంటారు.
అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు సైతం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నారు. ఎస్ఐఆర్ కారణంగా ఉత్తర భార తం, ఆంధ్ర నుంచి వచ్చిన వలస ఓటర్లు తమ సొంత ప్రాంతంలోనే ఎన్యుమరేషన్ చేయించుకోవటంతో పటాన్చెరు నియోజకవర్గం నుంచి శాశ్వతంగా వలసవెళ్లిన 82,918 మంది ఉన్నారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో 1,36,902 మంది ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నారు.

Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

