
మెదక్, సెప్టెంబర్ 21 : ఆజాది కా అమృత్ మహోత్సోవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. దేశ స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జన్ భాగిదారి టూ జన్ ఆందోళన్ పేరిట నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా అధికారులతో కలిసి టీ-షర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి పెంపొందించే విధంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. మెదక్ పట్టణంలో ఈ నెల 25న ఉదయం 7:30 గంటలకు ఫ్రీడమ్ రన్ ధ్యాన్ చంద్ సర్కిల్ నుంచి ప్రారంభమై రాందాస్ చౌరస్తా వరకు కొనసాగుతుందని, ఫ్రీడమ్ రన్లో జిల్లాలోని అధికారులు, సిబ్బంది, యువజన సంఘాలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి బిన్నీ, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, డీఆర్డీవో శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం, సీపీవో చిన్నకొట్యానాయక్, డీపీఆర్వో శాంతికుమార్ పాల్గొన్నారు.
ఇస్నాపూర్‌లో ఫ్రీడమ్ రన్ 2.0
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభు త్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ పేరున సంబురాలు చేసేందుకు పిలుపునిచ్చింది. మండలంలోని ఇస్నాపూర్‌లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని చేపట్టారు. నెహ్రూ యువ కేంద్ర వారి ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రీడమ్ రన్‌ను సర్పంచ్ బాలమణి శ్రీశైలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువతరం ఫిట్‌గా ఉండాలని ఆమె కోరా రు. ప్రతిఒక్కరూ రోజు అరగంట నడువాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై రాము లు, ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు స్పందన చౌదరి, నాయకుల కృష్ణ, కార్యదర్శి హరిబాబు, భూషణం పాల్గొన్నారు.