చిలిపిచెడ్, జూలై 12 : సుమారు 2వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టు, 2వేల మంది రైతులకు కల్పతరువైన చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి.ఈ ఎత్తిపోతల పథకాలు నడవక పోవడంతో ఏడేండ్ల నుంచి నీరందక రైతులు నష్టపోతున్నారు. ఈ సీజ్‌లో అయినా నీళ్లు ఎత్తిపోస్తారా లేదా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి మంజీరా నది ఒడ్డున 2004లో ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. 2013లో ఎత్తిపోతల పథకాలను నిర్మించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చారు. ఎత్తిపోతలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చండూర్, ఫైజాబాద్, గంగారం గ్రామాల రైతులు ఏటా రెండు పంటలు పండించారు. రెండేండ్ల క్రితం మంజీరా నది వరదతో ఉప్పొంగడంతో చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతలు దెబ్బతిన్నాయి. ఎత్తిపోతలను మట్టి, ముళ్లపొదలు కప్పేశాయి. ప్రాజెక్టు వెళ్లే దారి వరదతో కోతకు గురై ధ్వంసమైంది.మోటర్లు నీట మునిగాయి. ట్రాన్స్ఫార్మర్లు,స్టార్టర్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొన్నేండ్లుగా నీళ్లందక పంటలు కోల్పోయాం. వరదలకు ఎత్తిపోతల పథకం మోట ర్లు నీట మునిగాయి. పైపులు, ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు దెబ్బతిన్నాయి. ఈ పథకాలకు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. ఈసారి వరినాట్లకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్లో అయినా లిఫ్ట్‌ను ప్రారంభించాలని కోరుతున్నాం.
చండూర్ గ్రామ ఎత్తిపోతల మరమ్మతులకు రూ. 50లక్షలతో ప్రతిపాదనలు పంపిం చాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.ఈ సీజన్లో రైతులకు నీరందిస్తాం.మోటర్లుకు,ట్రాన్స్ఫార్మర్లలకు మరమ్మతులు చేయాలి.లిఫ్ట్‌కు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసమైంది.రోడ్డు పనులు పూర్తి చేయగానే ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభింస్తాం.