వ్యాక్సిన్ ముందుగా మీకే..

- ఇలాంటి మెస్సేజ్,కాల్స్‌ను నమ్మకండి
- డబ్బులు గుంజేందుకు నేరగాళ్ల నయా ఎత్తులు
- అనవసర లింక్‌లు ఓపెన్ చేయొద్దు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
కంది : కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ముందుగా మీకే ఇస్తాం. కానీ,కొంత మొత్తం మేము చెప్పిన అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మెసేజ్ ఏమైనా మీకు వచ్చిందా..? లేక ఇందుకు సంబంధించిన ఫోన్ కానీ లింక్ కానీ మీకు వచ్చిందా.. అలా వస్తే అస్సలు నమ్మకండి. సైబర్ నేరగాళ్ల నయా దందా మార్కెట్లో మొదలైంది. వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి డబ్బులు గుంజే పనిలో పడ్డారు ఈ మోసగాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్ తయారీ తీరు స్వయంగా మన ప్రధాని మోదీ శనివారం వచ్చి పరిశీలించారు. వాక్సిన్ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, అది వచ్చాకా ప్రతి ఒక్కరికీ అందజేస్తామని కూడా ప్రధాని వివరించారు.
అమాయకంగా మోసపోవద్దు..
కరోనా వైరస్ ప్రభావంతో ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. చాలా మంది ఇంకా దాని బారిన పడి కోలుకోలేకపోతున్నారు. దీంతో వైరస్‌పై ఎంతో భయం పుట్టుకొచ్చింది. ఎలాగైనా దీనికి వ్యాక్సిన్ ఉం టే తీసుకుని దాని బారి నుంచి బయటపడాలనే తపన అందరిలోనూ ఉన్న ది. ఈ భయాన్ని ఆసరా చేసుకొని కొందరు మోసగాళ్లు వ్యాక్సిన్ తయారీ అయిపోయిందని, మొదటి విడుతగా వ్యాక్సిన్లు తమ వద్ద స్టాక్ వచ్చిందని అమాయకులపై వలలు వేసే పనిలో పడ్డారు. మా వద్ద ఈ వ్యాక్సిన్ ఉంది మమల్ని సంప్రదిస్తే మీకు ఆ వ్యాక్సిన్ అందజేస్తామని బురడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించి ఫోన్‌కే మెసేజ్, లింక్‌లు పంపుతున్నారు. ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని, ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప వ్యాక్సిన్‌పై ఎలాంటి సమాచారాలను ఇతరులు చెబితే పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దు..
కరోనా వ్యాక్సిన్ రాబోతున్నది. ముందు మీకే ఇస్తాం. వెంటనే కొంత డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటూ.. మెస్సేజ్‌లు, ఫోన్ కాల్స్, లింక్‌లను అస్సలు నమ్మవద్దు. ఇలాంటి వాటికి స్పందించి మోసపోవద్దని సూచిస్తున్నాం. అలాంటివి వస్తే దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్లో తెలియచేయాలని సూచిస్తున్నాం. లేదా రాష్ట్ర సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 155260 నెంబర్‌కు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఫిర్యాదు చేసి సైబర్ మోసాలను తగ్గించడంలో ప్రజలు భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం.
- శివకుమార్, సంగారెడ్డి రూరల్ సీఐ
తాజావార్తలు
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్
- వదలం..కదలం
- ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి