గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 12, 2020 , 23:32:09

శాకంబరిగా వనదుర్గామాత

శాకంబరిగా వనదుర్గామాత

పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢమాసం మూడో ఆదివారం సందర్భంగా అమ్మవారిని రకరకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మాస్క్‌లు ధరించి, శానిటైజ్‌ చేసుకున్న తర్వాతే లోనికి అనుమతించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో చెట్ల కింద సందడి కనిపించింది. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌, సిబ్బంది సూర్యశ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ తదితరులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.


logo