ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 15, 2020 , 23:42:33

రైతు సేవ గొప్పది

రైతు సేవ గొప్పది

  • l  పనిచేసే వారందరికీ  పార్టీలో గుర్తింపు
  • l  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
  • l  గజ్వేల్‌ ఏఎంసీ పాలకవర్గ   ప్రమాణ స్వీకారం

గజ్వేల్‌ : అన్నం పెట్టే రైతన్నకు సేవచేసే అవకాశం లభించడం గొప్పదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో సోమవారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, సాగులో నూతన సంస్కరణలతో పాటు మార్కెటింగ్‌ అవకాశాలను రైతు వద్దకు తీసుకువెళ్తూ  వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి చేస్తున్న కృషిలో పాలకవర్గకమిటీ క్రియాశీలకం కావాలన్నారు. గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నియామకమైన మాదాసు అన్నపూర్ణ  శ్రీనివాస్‌ రైతులకు సహాయ సహకారాలు అందించాలని  కోరారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు ధరించాలన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజాశర్మ మాట్లాడుతూ పనిచేసే వారందరికీ సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్న ఏకైక పార్టీగా టీఆర్‌ఎస్‌ మన్ననలను పొందుతుందని చెప్పారు. 

సీఎం వెంటే నడుస్తా ..

రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తనకు ఈ పదవి అందించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డితో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, సీనియర్‌ నాయకులు ఎలక్షణ్‌రెడ్డి, డాక్టర్‌ యాదవరెడ్డి, నాయకులు దేవి రవీందర్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo