శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 05, 2020 , 00:53:10

జాతర హోరు.. బోనాల జోరు..

జాతర హోరు.. బోనాల జోరు..

రామాయంపేట :రామాయంపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ఘనంగా కల్యాణాన్ని జరిపారు. మంగళవారం మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా ఆలయంలోని ఎల్లమ్మకు పట్నాలు వేసి కల్యాణం జరిపారు. పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వాహకులు రేణుకాఎల్లమ్మకు పట్టువస్ర్తాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లతో ఎల్లమ్మ బోనాలు, మంద గంపలను యాదవులు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో ఒగ్గు కళాకారులతో ఒగ్గు కథలను చెప్పించారు. జాతరకు సుమారు 5వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. 

ఎడ్లబండ్ల ప్రదర్శన..

మంగళవారం దేవాలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన జరిగింది. అనంతరం దేవాలయ సన్నిధిలో రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్లు మల్లన్న స్వామి, రేణుకాఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు.

 రేణుకాఎల్లమ్మకు ఘనంగా బోనాలు..

టేక్మాల్‌ : రేణుకాఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని కుసంగి గ్రామంలో కొలువుదీరిన రేణుకాఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అమ్మవారికి బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాలతో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 


logo