కల్తీ కల్లు తాగి వంద మందికి అస్వస్థత
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పెద్దశివునూర్లో కల్తీకల్లు తాగి వందమంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వాంతులు విరేచనాలు కావడంతో సర్పంచ్ ముదాం రుక్మిణీబాయి, చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, వైద్యసిబ్బంది అప్రమత్తమై గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది
- మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్దశివునూర్లో ఘటన
- గ్రామాన్ని సందర్శించిన జిల్లా అధికారులు
- అప్రమత్తమైన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు
- గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
చేగుంట, అక్టోబర్ 26: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పెద్దశివునూర్లో కల్తీకల్లు తాగి వందమంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వాంతులు విరేచనాలు కావడంతో సర్పంచ్ ముదాం రుక్మిణీబాయి, చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, వైద్యసిబ్బంది అప్రమత్తమై గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని కల్లు యజమానులు కల్లులో వాడే మందు ఎక్కువ కలపడంతోనే ఇలా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మంగళవారం ఒక్కరోజు 73 మంది, బుధవారం 27 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 8మంది పరిస్థితి విషమించడంతో కొందరిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు, కొందరిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గ్రామంలోని చేగుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య బృందం పగడయ్య, కిషన్, నర్సింహులు, రాంగోపాల్, సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎం కాంత, ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు కావాల్సిన మందులు, అవసరమున్న వారికి స్లైన్లు ఎక్కిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కమలాకర్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్ అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి విజయనిర్మల పెద్ద శివునూర్ గ్రామాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి శానిటైజేషన్ సమస్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎవరికీ ప్రాణహాని లేదని, ప్రతిఒక్కరికీ మెరుగైన చికిత్స అందిస్తామని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా కొలుకునే వరకు వైద్యశిబిరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

