దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్కరికీ రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50మంది దళితులు కొంపల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మల్లుపల్లికి చెందిన దళితులంతా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి కాపీని ఎమ్మెల్యేకి అందజేశారు.
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 25: దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మల్లుపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది దళితులు కొంపల్లిలోని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాస గృహానికి వెళ్లి ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లుపల్లికి చెందిన దళితులమంతా బీఆర్ఎస్కు ఓటు వేసి పద్మాదేవేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మానం కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒకొక దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. దళిత బంధు పథకం విడతల వారీగా అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్ల్లోరి రాజు, ఎంపీటీసీ బి.యాదగిరి, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు ఇమ్మడి నరేశ్, ఉపసర్పంచ్ శ్రీహరి, సీనియర్ నాయకులు మెట్టు గణేశ్, శేషాద్రి, శంకరయ్య దళిత కుటుంబాల సభ్యులు తదితరులున్నారు.