
నిజాంపేట, ఏప్రిల్ 26: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చల్మెడ, నస్కల్, నగరం తండా, రాంపూర్ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలోధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లో రైతులు ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, సీఈవో లక్ష్మీనర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచులు రజిత, కర్రయ్య, గేమ్‌సింగ్, అమరసేనారెడ్డి , చల్మెడ ఎంపీటీసీ బాల్‌రెడ్డి,ఆత్మ కమిటీ మెంబర్ నాగరాజు,నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్లు ఉన్నారు.
రామాయంపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రామాయంపేట, ఏప్రిల్ 26: రైతులకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నా రు. పట్టణంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాల యం వద్ద, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, బొర్ర అనిల్, సుందర్‌సింగ్, మల్యాల కిషన్, డైరెక్టర్లు నర్సింహులు, కమిషనర్ శ్రీనివాస్, పోచమ్మల ఐలయ్య, సీఈవో నర్సింహులు, శ్రీనివాస్, దుర్గారెడ్డి, ఏఎంసీ సిబ్బంది తదితరులున్నారు.
వెంకటరత్నాపూర్‌లో..
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 26 : మండలంలోని వెంకటరత్నాపూర్‌లో తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ రాణీసత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రా మిరెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, మండల వ్యవసాయశాఖాధికారి నుస్రత్, ఏఈవో సంతోశ్, రైతులు పాల్గొన్నారు
మండలంలో..
వెల్దుర్తి, ఏప్రిల్ 26: మండలంలోని నెల్లూర్, హస్తాల్పూర్, మాసాయిపేట మండల పరిధిలోని బొమ్మారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ స్వరూప ,సర్పంచ్ శంక ర్, నాయకులు నరేందర్‌రెడ్డి, స్టేషన్శ్రీను తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకే పీ ఏపీఎం శంకరయ్య, పలువురు అధి కారు లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కొల్చారం….
కొల్చారం, ఏప్రిల్ 26: రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఏడీఏ బాబూ నాయక్ తెలిపారు. రంగంపేటలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి ధాన్యంలో తేమశాతం, నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాల్‌రెడ్డి, ఏఈవో భార్గవ్, రైతులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్…
చిలిపిచెడ్, ఏప్రిల్ 26: మండల పరిధిలోని బద్రియ తండా లో సోమక్కపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బుజ్జిబాయి ప్రారంభించారు.గౌతాపూర్‌లో సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్‌గౌడ్ పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకరావాలి
చేగుంట, ఏప్రిల్ 26: ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని చేగుంట తహసీల్దార్ విజయలక్ష్మి అన్నారు. మక్కరాజిపేటలో సొసైటీ నుంచి వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడారు.మక్కరాజిపేటలో సొసైటీ కొనుగోలు చేసిన ధాన్యం నార్సింగిలోని హనుమాన్, భాగ్యలక్ష్మి రైస్‌మిల్‌కు పంపించగా , తాలు ఎక్కువగా ఉందని ఇబ్బంది పెడుతున్నారని, తహసీల్దార్‌కు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు వివరించారు. రైస్‌మిల్లర్స్‌తో, రైతులతో తహసీల్దార్ మాట్లాడారు. నిబంధనల ప్రకారం ధాన్యం తెస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు.కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ డెరెక్టర్ రఘువీర్‌రావు, రైతు బంధు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ , రైతులు ఉన్నారు.
తూకంలో మోసం లేకుండా చూడాలి
తూకంలో మోసం లేకుండా చూడాలని ఐకేపీ ,డీఆర్డీవో భీమమ్య అన్నారు. చేగుంట మండల పరిధిలోని చందాయిపేట , మక్కరాజిపేట్, పెద్దశివునూర్, చిన్నశివునూర్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చేగుంట ఏపీఎం లక్ష్మీ నర్సమ్మ, ఐకేపీ సీసీలు, రైతులు ఉన్నారు.