చేగుంట, ఫిబ్రవరి 24 : రాష్ట స్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 24 మంది క్రీడాకారులు ఎంపికైనట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణం మల్లీశ్వరి, కోచ్ కరుణం గణేశ్వ్రికుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన చేగుంటలోని ఆదర్శ పాఠశాల ఆవరణలో రగ్బీ క్రీడాకారులను ఎంపిక చేశారు. జిల్లా నుంచి 130 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబర్చిన బాలికల విభాగంలో చేగుంట స్పోర్ట్స్ పాఠశాలకు చెందిన అంకిత, సునీత, వందన, రోజా, నిఖిత, నిహారిక, జ్యోతి, సరోజ, అంకిత, రాధిక ఎంపికయ్యారు. చేగుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన వెన్నెల, రేణుక, జఫ్స్ ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అరవింద్, అరుణ, లక్ష్మీనరసింహ, శివశంకర్, సందీప్, సురేందర్, సాయికుమార్, అరవింద్, సాయి, శ్రీనివాస్, బాబు, నిఖిల్ ఎంపికయ్యారు. ఎంపికైన వారు ఈనెల 27న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్‌రెడ్డి, పీఈటీలు వెంకటేశ్, శారద, వనిత, రెఫరీలు మోహన్, నవీన్, మహేశ్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ క్రీడలకు మహిళల ఎంపికలు..
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియాలో భాగంగా కబడ్డీ పోటీల్లో మహిళల ప్రవేశాలకు ఈనెల 25, 26 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజవ క్రీడల అధికారి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు గల మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని హాకీ కాంప్లెక్స్‌లో జరిగే ఎంపికకు హాజరుకావాలని సూచించారు. స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, 4 పాస్ ఫొటోలు, తీసుకెళ్లాలని తెలిపారు.