పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్/ వర్గల్ ఫిబ్రవరి 15 : టీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మహర్దశ రానున్నదని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మజీద్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో సునీత, ఎంపీపీ లతా రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ బాలమల్లు, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బబ్బూరి లతా శివరాంగౌడ్ పాల్గొన్నారు.
దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలి
సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలో..
తూప్రాన్/రామాయంపేట, ఫిబ్రవరి 15 : అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ప్రథమస్థానంలో నిలిపా రని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, మున్సిపల్ పట్టణాధ్యక్షుడు సతీష్ చారి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్ యాదవ్, సత్యలింగం, రఘుపతి, శైలంగౌడ్, మన్నె శ్రీనివాస్, చక్రవర్తి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రామాయంపేటలో..
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజుల అధ్వర్యంలో రామాయంపేట పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రభుత్వ దవాఖానకు వెళ్లి రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అలాగే, సీస కమ్మరి వృత్తిదారులకు కూడా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్, మల్యాల కిషన్, బాలుగౌడ్, కన్నపురం కృష్ణాగౌడ్, మెట్టు యాదగిరి, సిద్దిరాంరెడ్డి, శ్రీనివాస్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కర్రె రమేశ్ తదితరులున్నారు.