చేగుంట, అక్టోబర్ 14 : భూ సమస్యల పరిష్కారానికి ప్ర భుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పోతాన్పల్లి సర్పంచ్ కారింగుల సంతోశ, చెట్లతిమ్మాయిపల్లి సర్పంచ్ మోహన్రాథోడ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని పోతాన్పల్లిలో సర్పంచ్ సంతోష, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఓంప్రకాశ్, చెట్లతిమ్మాయిపల్లిలో సర్పంచ్ రాథోడ్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోడుభూములను సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు, వాటి ఉపయోగాలను గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామసభల్లో పంచాయతీ కార్యదర్శులు రమేశ్, మౌనిక, ఉప సర్పంచ్ ముఖేశ్, ఆటవీ చైర్మన్ కారిగుల అంజిరెడ్డి, వార్డు సభ్యులు సద్దాం హుస్సేన్, అందె లక్ష్మి, గణేశ్, తలారి దుర్గయ్య, మల్లేశ్, తిరుపతి, శేఖర్, అరికెల స్వామి, శ్రీను, నర్సింహులు, కేతావత్ మోతీలాల్, టీఆర్ఎస్ నేతలు బాలసాయి హరిప్రసాద్, కారింగుల సిద్ధిరెడ్డి ఉన్నారు.
లావణి, పోడు భూములను పరిష్కరించాలి
లావణిపట్టా, పోడు భూ ములను పరిష్కరించాలని ఎఫ్ఆర్సీ సభ్యులు తీర్మానించారు. కొండాపూర్(ఎస్)గ్రామంలో ఫారెస్టు అధికారులు పర్యటించారు. ఎఫ్ఆర్సీ కమిటీ, రైతు లు, ప్రజలు సమావేశమయ్యారు. గ్రామంలో 27 మంది రైతులకు సంబంధించిన పోడు భూములపై సర్వే నిర్వహిం చడానికి అటవీశాఖ అధికారులు రావడంతో వారిని రైతులు అడ్డుకున్నారు. సుమా రు 75 ఏండ్ల నుంచి 625 మంది రైతులు, 556 ఎకరాల ఫారెస్టు భూ మిని సాగు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు జారీ చేసిన పట్టాపాస్ పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్త పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయకుండా, పోడు భూములను పార్ట్ బీలో చేర్చిందని రైతులు వివరించారు. సర్వే నెంబర్ 139లో 115 ఎకరాల 18గుంటలు, 349లో 313.14, 351 లో 3.19, 352లో 1.19, 353లో 2, 354లో 1.7, 355లో 1.6, 356లో 118 ఎకరాల భూమిని పూర్వం నుంచి సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. ఫారెస్టు, రెవెన్యూశాఖల అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి పార్-బీలో ఉన్న భూ ములపై రైతులకు పట్టా పుస్తకాలు మంజూరు చేసిన తర్వాతే పోడు భూములను పరిష్కరించాలని ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యు లు, రైతులు తీర్మానించారు. తీర్మాన పత్రాన్ని ఫారెస్టు అధికారి ఆజాంకు అందజేశారు. పార్ట్-బీ భూములపై పట్టాపుస్తకాలను ఇవ్వాలని గ్రామ రిజర్వ్ ఫారెస్టు కమిటీ, రైతులు కోరారు.