
వెల్దుర్తి, సెప్టెంబర్ 6: కరోనా వైరస్ ప్రభావంతో 16 నెలల అనంతరం తెరుచుకున్న పాఠశాలలో ముందస్తు చర్యలో భాగంగా ప్రతి పాఠశాలలో ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం వెల్దుర్తిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, కార్మికులకు సూచనలు చేశారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం డీఈవో విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాబోధన పాఠశాలల్లో పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు జ్వరం, జలుబు ఇతర సమస్యలు ఉంటే గుర్తించి వెంటనే ఐసొలేషన్ గదికి తరలించి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు హాజరు అధికంగా ఉందన్నారు. డీఈవో వెంట ఎంఈవో యాదగిరి, హెచ్ఎం సాంబ య్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
రామంతాపూర్ తండాలో…
మండలంలోని రామంతాపూర్ తండా ప్రాథమిక పా ఠశాలలో వంది మంది విద్యార్థులకు మాస్క్‌లను, వర్క్‌బుక్స్‌ను జీఎంఆర్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ అం దజేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ జీవన్, ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ పాల్గొన్నారు.
మనోహరాబాద్‌లో..
పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీఈవో రమే శ్ ఉపాధ్యాయులకు సూచించారు. శివ్వంపేట మం డలం దంతాన్పల్లి, తూప్రాన్ మండలం నాగులపల్లి పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యం పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట, సెప్టెంబర్ 6: చల్మెడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోరామాయంపేట పట్టణానికి చెందిన నగల వ్యాపారి ఓంప్రకాశ్ అనిత దంపతులు 160 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్‌శర్మ, మమత, నవీన్త్న్రాకర్, శ్రీనివాస్, మమత ఉన్నారు.
చేగుంటలో..
మండల పరిధిలోని చెట్ల తిమ్మాయిపల్లి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు జీఎంఆర్ వరలక్ష్మీఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్క్ బుక్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు జీఎంఆర్సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో చేగుంట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, సర్పంచ్ మోహన్, పాఠశాల హెచ్ఎం అక్బర్, ఉపాధ్యాయులు బాలరాజు, హరిరంజన్శర్మ, సుధాకర్, కవిత, తదితరులున్నారు.చందాయిపేట పాఠశాలలో భారతీయ సేవా సహకార ఫ్రంట్ సహకారంతో మాస్క్‌లు,శానిటైజర్లు సర్పంచ్ స్వర్ణలత అందజేశారు.