
మెదక్ మున్సిపాలిటీ, జూలై 2: పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు సుందరంగా మారాలని మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ 3 వార్డు ఆవుసులపల్లిలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, వార్డు కౌన్సిలర్ విశ్వంతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచాలని సూచించారు. సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాలు అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. వార్డుల్లో సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి వేదిక అని, పట్టణ ప్రగతికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఆర్కె శ్రీనివాస్, సమియొద్దీన్, జయరాజ్, కిశోర్, వేదవతి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గౌస్ఖురేషి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈ సిద్ధ్దేశ్వరీ, వర్క్ ఇన్స్పెక్టర్ సలీం, మెప్మా సిబ్బంది సునీత, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, మోచి కిషన్, బొద్దుల కృష్ణ, సుమన్, ఉమర్, సాధిక్ పాల్గొన్నారు.
అక్కన్నపేటలో మొక్క నాటిన ఎమ్మెల్యే
రామాయంపేట, జూలై 2 : మండలంలోని అక్కన్నపేట గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మొక్క నాటి నీరు పోశారు. రామాయంపేటలోని ఓ పెండ్లి విందుకు హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు మున్సిపల్ కమిషనర్లు కౌన్సిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా కౌన్సిలర్లు తమ వార్డులను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి, వాటి బాధ్యతను కాలనీ వాసులకు సంబంధిత వార్డు కమిటీలకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్‌కు సూచించారు. పట్టణంలోనరి టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త పాతూరి సిద్ధిరాములు, నర్సమ్మ కుమారుడు పాతూరి ప్రశాంత్, సుశ్మితలను ఆయన స్వగృహంలో ఆశీర్వదించారు. ఆమె వెంట మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, కమిషనర్ శ్రీనివాసన్, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, అక్కన్నపేట సర్పంచ్ జంగం నర్సమ్మ, ఎంపీటీసీ జ్యోతి, దేమె యాదగిరి, బొర్ర అనిల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్ రెడ్డి, శ్యాం సుందర్, రాజు, కాలేరు ప్రసాద్, పాతూరి రాజు ఉన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి :పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
బొల్లారం, జూలై 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. చిత్తారమ్మ దేవాలయం సమీకృత మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, స్థానికులు ఉన్నారు.
గ్రామాలు పచ్చదనంతో మెరిసిపోవాలి :సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి
పుల్కల్ రూరల్, జూలై 2 : గ్రామాలు పచ్చదనంతో మెరిసి పోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అన్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పర్యటించి పల్లె ప్రకృతి వనం, ప్రభుత్వ పాఠశాల, డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాం టేషన్‌ను సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో మొక్క నాటారు. గ్రామస్తులకు హరితహారంపై అవగాహన కల్పించారు. ఆమె వెంట ఎంపీడీవో మధులత, సర్పంచ్ సంగమ్మ విష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు ఉన్నారు.