
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 30 : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు, నివాసాల్లో వేడుకలు ఘనంగా జరిపారు. సోమవారం ఆయా వైష్ణవ దేవాలయాలు, నివాసాల్లో ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, వస్ర్తాలంకరణ, వివిధ రకాల పుష్పాలు, తులసీ మాలలతో అందంగా అలంకరించారు. అనంతరం శ్రీ కృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కాలనీ వాసులు చిన్నారులు శ్రీ కృష్ణ, రాధ, గోపికల వేషధారణలు వేశారు. హిందూ బంధువులు, భక్తులు సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో సోమవారం నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించగా, అంతకుముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.
న్యాల్కల్ మండలంలో…
మండలంలోని గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమీరాబాద్ గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. హద్నూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు.
హత్నూర మండలంలో
హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలతో అలంకరించి నృత్యాలు చేయించారు.
రాయికోడ్ మండలంలో…
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లోని చిన్నారులు శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణలతో గ్రామాల్లో పురవీధుల గుండా ర్యాలీలు నిర్వహించి ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు.
నాగల్గిద్దా మండలంలో…
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
సదాశివపేటలో…
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సదాశివపేట శ్రీ కృష్ణనగర్ కాలనీలోని శ్రీ కృష్ణమందిరంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విజయ్‌కుమార్ గుప్తా, భాస్కర్, ఆనంద్, రాజు, రాజశేఖర్, శ్రీనివాస్, నగేశ్, రాములు, విజయ్ పాల్గొన్నారు.
కొండాపూర్ మండలంలో…
గంగారం, మన్సాన్పల్లి, కొండాపూర్, అనంతసాగర్, మల్కాపూర్ గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
జహీరాబాద్‌లో
జహీరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మా ష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవానీ మందర్ చౌరస్తా వద్ద గొల్లకుర్మలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. భవానీ మందిర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు ఎంజీ.రాములు పాల్గొని ఉట్లు కొట్టారు. కార్యక్రమంలో గొల్ల కురుమ యాదవ్ సంఘం నాయకులు రమేశ్‌బాబు, తట్టునారాయణ, సుభాశ్ ఉన్నారు.
ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో…
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లతో పాటు తెల్లాపూర్ మున్సిపాలిటీలో సోమవారం ఘనంగా జరిగాయి. భెల్‌లోని శ్రీకృష్ణుడి ఆలయంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, తదితర నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
బొల్లారం మున్సిపల్ పరిధిలో
మున్సిపల్ పరిధిలోశ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ప్రజలకు చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.