
న్యాల్కల్, సెప్టెంబర్ 6 : మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో మామిడివాగు దాటుతూ వరద నీటిలో గల్లంతైన వాహన చోదకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకా రం.. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీలు శంకర్రాజు, బాలాజీతోపాటు మండల తహసీల్దార్ రాధాబాయి ఆదివారం సాయంత్రం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసులు, గ్రామస్తులు కలిసి వాగు పరిసరా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం రాత్రి వాగులో మోటార్ బైక్ లభించింది. రాత్రి కావడంతో వెలుతురు సరిగ్గా లేకపోవడంతో గల్లంతైన వ్యక్తిని వెతికేందుకు వీలుకాలేదు. సోమవారం ఉదయం సర్పంచ్ కుత్బుద్దీన్, గ్రామ సేవకులు కలిసి మామిడివాగు పరిసరా ప్రాం తంలో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కిలో మీటర్ దూరంలో వాహన చోదకుడి మృతదేహం కనిపించిం ది. వాగులో నుంచి మృతదేహాన్ని గ్రామస్తులు బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై వినయ్‌కుమార్, ఏఎస్సై ఈశ్వర్ తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు ఝరాసం గం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్(35)గా గుర్తించారు. మృతుడి భార్య సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
సర్పంచ్‌ను అభినందించిన డీఎస్పీ శంకర్‌రాజ్..
రేజింతల్ గ్రామ శివారులోని మామిడివాగు నీటి ఉధృతలో గల్లంతైన కమలాకర్ ఆచూకీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గ్రామ సర్పంచ్ కుత్బుద్దీన్ను జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్ అభినందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్పాటు గ్రామానికి చెందిన యువకులు సం గన్న, ప్రశాంత్, రాజును డీఎస్పీ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, నర్సింహులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.