
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 21: ఆదిదేవుడు గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. పదకొండు రోజుల పాటు పూజలందుకుందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వినాయకుల శోభాయాత్ర మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద వచ్చిన గణనాథులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు. నిమజ్జనం సందర్భంగా ఏఎస్పీ కృష్ణమూర్తి, డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నిమజ్జనోత్సవంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బ్యాండ్ వాయించగా.. మున్సిపల్ చైర్మన్ నృత్యాలు చేశారు. యువతులతో కలిసి పద్మాదేవేందర్‌రెడ్డి స్టెప్పులేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి కౌన్సిలర్లు కిశోర్, మామిళ్ల ఆంజనేయులు, సమియొద్దీన్, జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. జీకేఆర్ కాంప్లెక్స్ పంచముఖి వినాయక మండలి వద్ద సోమవారం రాత్రి టీవీ ఆర్టీస్టులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వేలాది మంది భక్తులకు అల్పాహారాన్ని పంపిణీ చేశామని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తెలిపారు. సంఘం నాయకులు లక్ష్మీపతి, కొండ శ్రీనివాస్, పురం వెంకటనారాయణ, శివరామకృష్ణ, శివ్వ ఆంజనేయులు, శంకర్, సకిలం శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొంటూరు చెరువును సందర్శించిన డీఎస్పీ సైదులు
మెదక్ మండలంలో కొంటూరు చెరువులో గణేశ్ నిమజ్జనం వేడుకలను డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ పాల్లవేలి, ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీవో మౌనిక , మున్సిపాల్ కమిషనర్ శ్రీహరి పర్యవేక్షించారు. రూరల్ ఎస్సై కృష్ణారెడ్డి, మున్సిపల్, పంచాయతీ, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
మండల కేంద్రం హవేళీఘనపూర్తోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వినాయకులను ఆయా గ్రామాల సమీప చెరువుల్లోకి తరలించి నిమజ్జనం చేశారు.
చిలిపిచెడ్, సెప్టెంబర్ 21: చిలిపిచెడ్ మండలంలోని చండూర్లో కొత్తకాలనీలో వినాయకుడి నిమజ్జనంలో గణేశుడి లడ్డూ వేలం పాటలో రూ.16,500కి వనం కృష్ణ, కైవసం చేసుకున్నారు. రెండో లడ్డూ గొట్టం ప్రశాంత్ రూ.10 వేలకు, మూడో లడ్డూ పులకంటి ఎల్లయ్య రూ.5వేలకు కైవసం చేస్తుకున్నట్లు సభ్యులు తెలిపారు. చిన్నారుల ఆటపాటలు, కోలాటాల నడుమ వినాయక నిమజ్జనం నిర్వహించారు.
దైవ గణేశ్ లడ్డు రూ.61,500 వేలు
పట్టణంలోని పలు వినాయకుల వద్ద లడ్డూలు వేలం పాట పాడారు. చిల్డ్రన్ పార్క్ వద్ద గల దైవ గణేశ్ మండల లడ్డు వేలంలో పట్టణంలోనే అత్యధికంగా రూ.61,550లకు సత్యం కైవసం చేసుకున్నాడు. కోలిగడ్డ నేతాజీ గణేశ్ మండలికి చెందిన లడ్డూ వేలంలో రూ.61,00 నేతాజీ గణేశ్ మండలి సభ్యులు సొంతం చేసుకున్నారు. పంచముఖి గణేశ్ మండలి లడ్డూ రూ. 50వేలకు గోపాల్పేట నర్సింహులు దక్కించుకున్నారు.