
నిజాంపేట,నవంబర్1: అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నదని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. సోమవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించి మాట్లాడారు.అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, మండల ఏవో సతీశ్, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, కిష్టారెడ్డి, స్వామిగౌడ్, శ్రీధర్‌రెడ్డి, రాజం, దుర్గయ్య, సుధాకర్‌రెడ్డి, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, మంగ్యానాయక్, వార్డు సభ్యుడు రాజు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, సీఈవో శోభారాణి, నాయకులు లక్ష్మీనర్సింహులు,సత్యనారాయణ,రైతులు ఉన్నారు.
నర్సాపూర్‌లో…
రైతులకు టీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిప్పల్తుర్తి, మహ్మదాబాద్, మూసాపేట్, ఇబ్రహీంబాద్, జక్కపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ , ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యాన్ని విక్రయించి మ ద్దతు ధరను పొందాలని సూచించారు . కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, వైస్ ఎంపీపీ నర్సింగరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ శ్యామల లక్ష్మణ్‌గౌడ్ నాయకులు పాల్గొన్నారు.
రైతును రాజును చేయడమే లక్ష్యం..
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం గుండ్లపల్లి, బిజిలిపూ ర్, చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, తిమ్మాపూర్, బిక్యాతండా, తాళ్లపల్లి, పిల్లుట్ల, లింగోజిగూడ, అల్లీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం గోమారంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ సాగు చేస్తున్న వరి వెదజల్లె పద్ధతిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యుడు, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారమణగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్యమాధవరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో నవీన్‌కుమార్, సర్పంచ్‌లు శ్రీనివాస్, చంద్రకళ, బాలమణి, రవి, సుగుణ, ఎంపీటీసీలు దశరథ, లక్ష్మి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంటలో..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని చేగుంట ఎం పీపీ శ్రీనివాస్, చేగుంట, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్లు సండ్రుగు స్వామి, మ్యాకల పరమేశ్ అన్నారు. చేగుంట సొసైటీ పరిధిలోని ఉల్లితిమ్మాయిపల్లి, అనంతసాగర్, రెడ్డిపల్లి సొసైటీ పరిధిలోని రెడ్డిపల్లి, రుక్మాపూర్, బీంరావ్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్లు రాములు, ఆంజనేయులు, సర్పంచ్‌లు , ఎంపీటీసీ గాండ్ల లత, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్లు సత్యనారాయణ, రాజయ్య, మోహన్,అయిత రఘురాములు, బాగులు, జగతి, బాల్‌రాజు, అంబరిషా, రాజు , ఉపసర్పంచులు రైతులు ఉన్నారు.