శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Nov 12, 2020 , 02:03:24

వేగంగా రిజిస్ట్రేషన్లు

వేగంగా రిజిస్ట్రేషన్లు

చెన్నూర్‌ : చెన్నూర్‌ తహసీల్‌ కార్యాలయంలో బుధవారం మూడు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఓదెలు నుంచి సర్వేనంబర్‌ 72/అలో 22 గుంటల భూమిని మల్లయ్య కొనుగోలు చేశారు. లింగంపల్లి గ్రామానికి చెందిన సిడెంక లస్మయ్య నుంచి సర్వే నంబర్‌ 106అ/2/1లో 10 గుంటలు, సర్వే నంబర్‌ 109/అలో 10 గుంటల భూమిని సల్పాల సువర్ణ కొనుగోలు చేశారు. వీరు స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్‌ కార్యాలయా నికి వచ్చారు. దీంతో తహసీల్దార్‌ జ్యోతి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్‌కు దాదాపు అర గంట సమ యం పట్టింది. అనంతరం కొనుగోలు దారుల కు తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మల్లయ్యకు ఉన్న పట్టా దారు పాస్‌ పుస్తకంలో ఆ భూమిని నమోదు చేశారు. ఈ రిజిస్ట్రే షన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 12,205 ఆదాయం వచ్చింది.


కోటపల్లి : తహసీల్‌ కార్యాలయంలో మొత్తం ఐదు రిజి స్ట్రేష న్లను విజయవంతంగా చేసినట్లు తహసీల్దార్‌ రామచంద్రయ్య తెలిపారు. ఒక విరాసత్‌, 4 సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్లను చేసి పట్టా నకళ్లను అందజేసినట్లు ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టా జారీల ప్రక్రియ 15 నుంచి 20 నిమిషాల్లోగా పూర్తి అవుతుందని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్విని యో గం చేసుకోవాలని సూచించారు. ఇందులో ధరణి ఆపరేటర్‌ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.


logo