లింగాల, నవంబర్ 14 : మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడలు ముగిసాయి. గురువారం పోటీలు హోరాహోరీ గా కొనసాగాయి. అండర్ -14 కబడ్డీ విజేత అచ్చంపేట నిలవగా.. రన్నర్‌గా పెద్దకొత్తపల్లి, ఖోఖోలో దామరగిద్ద గెలవగా.. లింగాల రన్నర్‌గా నిలిచింది. టెన్నికాయిట్‌లో హేమచరణ్ (బాలానగర్), శ్రీకాంత్ (జేపీనగర్), చదరంగంలో లింగాల విజేతగా నిలవగా.. రన్నర్‌గా జేపీనగర్, క్యారమ్స్ విభాగంలో భరత్పౌలే (జేపీనగర్), రన్నర్‌గా అభినయ్, సిద్దార్థ (పెద్దకొత్తపల్లి), అచ్చంపేట చాం పియన్‌గా నిలిచింది.
అండర్-17 కబడ్డీ విజేతగా ఇటిక్యాల, రన్నర్ దేవరకద్ర, ఖోఖోలో విజేత దామరగిద్ద, రన్నర్‌గా జేపీ నగర్, వాలీబాల్ విజేత అయిజ, రన్నర్‌గా అచ్చంపేట, బాల్‌బ్యాడ్మింటన్ విజేత ఇటిక్యాల, రన్నర్ గా లింగాల, హ్యాండ్‌బాల్ విజేత బాలానగర్ నిలిచింది. అండర్-19 విభాగం కబడ్డీలో విజేతగా లింగాల, రన్నర్‌గా ఇటిక్యాల, ఖోఖో విజేత జేపీనగర్, రన్నర్‌గా మదనాపురం, వాలీబాల్ విజేత లింగాలకు బహుమతులను ప్రదానం చేశారు. పోటీలకు హాజరైన ఎస్సై నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో మెళకువలు నేర్చుకొని మం చి క్రీడాకారుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.