కొల్లాపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి యువతీ, యువకులు ఓటరుగా ( voter list) నమోదు చేసుకోవాలని కొల్లాపూర్ రెవిన్యూ డివిజనల్ అధికారి బన్సీలాల్ ( RDO Bansilal ) పిలుపునిచ్చారు.
ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ తహసీల్దార్ భరత్ కుమార్ తో కలసి శుక్రవారం కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఓటు హక్కుపై అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడం ద్వారా దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తిని పొందుతారని తెలిపారు.
కొత్తగా ఓటర్లుగా నమోదైన యువతను ఆయన అభినందిం చారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఆశలకు లోబడకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ అధ్యాపకులు,విద్యార్థులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.