నారాయణ పేట, సెప్టెంబర్ 11 : గంజాయి కొట్టడం అయితేనేమి.. హేరాయిన్, కొకైన్ పదా ర్థం సేవించడం అయితేనేమి.. పెట్రోల్, వైట్నర్ వాసన పీల్చడం అయితేనేమి కికు ఎకిందా లే దా అన్నదే మాదకద్రవ్య బాధితులకు ముఖ్యం. ఇందులో గంజాయి, హేరాయిన్, కొకైన్ పదార్థాలు దొరకడం అంత సులువైన విషయం కాకపోవడంతో పెట్రోల్, వైట్నర్ల వానన పీల్చుతున్నారని చెప్పవచ్చు. ఒక గుడ్డలో పెట్రోల్ చుక లు వేసి అవసరమైనప్పుడల్లా పీల్చుతూ.. మ త్తులో జోగుతున్నారు.
అదే సమయంలో వైట్న ర్ వాసనను పీలుస్తూ మత్తు ఫీల్ అవుతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువ త తాజాగా నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాదు.. పైగా సులువుగా అందుబాటులో లభిస్తుండడంతో ఫ్లై వుడ్ పై డేకోలం అంటించేందుకు ఉపయోగించే హీటెక్స్ అనే సుల్యూషన్ను మత్తు పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఫ్లైవుడ్ దుకాణాల్లో రూ.150కి 250 మిల్లీ లీటరు లభించే హీ టెక్స్‌ను ఒక కవర్లో వేసుకొని అందులో గాలి ఊదడం ద్వారా వచ్చే ఒక రకమైన గాలిని పీలుస్తూ మత్తులో జోగుతున్నారు. ఎకువశాతం యువకులు హీటెక్స్ బారిన పడుతున్నారని సమాచారం.
ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాల్లోనూ మత్తు బానిసలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇందులో ఎకువశాతం యువతే ఉన్నట్లు సమాచారం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఫ్లైవుడ్ దుకాణాల్లో ఇటీవల హీటెక్స్ కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నా రు. వాస్తవంగా ఆ వ్యాపారులు కూడా మొదట్లో ఫ్లైవుడ్ పనుల్లో ఉపయోగిస్తున్నారులే అనుకున్నారు. కానీ కొనుగోలు చేసిన వాళ్లే తిరిగి కొనుగోళ్లు చేస్తుండడం, పైగా కార్పెంటర్లకు సంబంధం లేని వారు అందులోనూ యువకులు ఉండడంతో ఎందు కు కొనుగోళ్లు చేస్తున్నారని కొంతమంది ఫ్లైవుడ్ దుకాణదారులు ఆరా తీయగా అ సలు విషయం వెలుగు చూసింది.
మత్తుకు బానిసలైన యువకులు తమ జీవితాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు. వాస్తవంగా ‘నమస్తే తెలంగాణ’ ఈ కథనాన్ని వెలుగులోకి తెచ్చేంత వరకు కూడా బహుశా పోలీసులకు హీటెక్స్ బారిన పడి యువకులు మత్తులో జోగుతున్నారనే విషయం గురించి తెలియదని సమాచారం. కేవలం గంజాయిపై దృష్టి సారించిన పోలీసులు హీటెక్స్ కొనుగోలు దారులై దృష్టి పెట్టకపోవడం అందుకు కారణంగా చెప్పవచ్చు. నిజంగా తెలిసి ఉంటే ఇప్పటికే ఆ వైపు చర్య లు తీసుకునే వారు.
ఇప్పటికైనా పోలీసు అధికారులు ఆ వైపుగా దృష్టి సారించి, ఇ ప్పటికే హీటెక్స్ కొనుగోలు చేసి, దాని బారిన పడి, పెడదారిన పడిన యువకుల వి వరాలు సేకరించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం తద్వారా వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చి వారి జీవితాన్ని కాపాడవలసిన అవసరం ఎంతో ఉంది. అదే సమయంలో ఫ్లైవుడ్ దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి కేవలం కార్పెంటర్లకు మా త్రమే హీటెక్స్ విక్రయించే విధంగా ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఫ్లైవుడ్ దుకాణాల్లో నిఘా ఉంచడం ద్వారా కొంత వరకైనా హీటెక్స్ మత్తుకు బానిసలైన వారిని కట్టడి చేసే అవకాశముంది. తమ పిల్లలకు ప్యాకెట్ మనీ ఇస్తున్న వారి తల్లిదండ్రులు అదే సమయంలో తమ పిల్లల ప్రవర్తనలపై కూడా ఓ కన్నేసి ఉంచడం ద్వారా పె డదారిన పడకుండా జాగ్రత్త పడే అవకాశం లేకపోలేదు.