మరికల్ : మరికల్ మండలంలోని పసుపుల గ్రామ సమీపంలో రైలు ( Train ) కిందపడి యువకుడి ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్( Chhattisgarh ) రాష్ట్రానికి చెందిన బుడ్డు(26) అనే యువకుడు మద్యం తాగి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బుడ్డు శరీరం రెండు భాగాలుగా విడిపోయింది.
పసుపుల గ్రామంలో బోరు బండి పై జీవనం సాగిస్తున్న అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. బోరు యజమాని శేఖర్ రెడ్డి మహబూబ్నగర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైల్వే పోలీస్ అధికారి రామకృష్ణ ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.