గంజాయి మత్తు వారి జీవితంలో చీకటిని నింపుతున్నది. అంతేకాకుండా మత్తులో లైంగికదాడులు, హత్యలు, దారిదోపిడీలే కాకుండా చివరకు ఆత్మహత్యలకు సైతం పాల్పడే స్థితికి చేరుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాలయాల్లోకి సైతం ఈ విషపు మత్తు ప్రవేశించింది. నగరాల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి పల్లెలకు సైతం గంజాయి మత్తు చేరి ఎందరో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నది.
– మహబూబ్‌నగర్, మే 18
గంజాయికి బానిసై యువత మత్తుతో చిత్తవుతున్నారు. గంజాయి మత్తుకు అలవాటుపడిన ఓ యువకుడు సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమవడం మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో గంజాయి ముఠా తిష్టవేసినట్లు ప్రా థమిక విచారణలో తేలిందని పోలీసులు సైతం చెబుతున్నారు. ప్రధానంగా కళాశాలల్లో యువత గంజా యి మత్తులో జోగుతున్నారు. అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, నల్గొండ, కర్నూల్ నుంచి గంజాయి వస్తున్నట్లు సమాచారం.
మారుపేర్లతో దందా..
బాటిల్ షార్ట్, స్కోర్, స్టోరీ, జాయింట్ సెక్షన్, ఆకుపచ్చ ఇలా మారు పేర్లతో గంజాయి విక్రయిస్తూ కొ త్త తరహా దందాకు శ్రీకారం చుడుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రేతలను, వినియోగదారులను పట్టుకొని విచారించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. మత్తు పదార్థాలు వినియెగించిన వారే వ్యాపారులుగా మారుతున్నారు. వీరి వ్యాపారం క్ర మంగా గ్రామాలకు విస్తరించడం కలవరపెడుతోంది.
సరిహద్దు నుంచి సరఫరా..
జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి సరఫ రా అవుతున్నది. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారు. ద్విచక్రవాహనాలతో సైతం రవాణా సాగిస్తున్నారు. నల్లమల ఆటవీ ప్రాంతం గంజాయి విక్రయాలకు కేంద్రంగా మారినట్లు అనుమానిస్తున్నారు. ఏపీ నుంచి ఎక్కువగా అచ్చంపేట ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది.
అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలోని రాయిచూర్ నుంచి కూడా గంజాయి ఎక్కువగా దిగుమతి అవుతున్నది. కొన్ని ప్రైవేట్ కళాశాలలు, ఉన్నత విద్యాకళాశాల్లో గంజాయి ఎక్కువ విక్రయిస్తున్నట్లు అనుమానాలున్నాయి. జిల్లా కేంద్రం శివారులో గుట్టల ప్రాంతంలో ఉన్న కళాశాల ప్రాంతంలో గంజాయి వి క్రయాలకు ప్రత్యేక ముఠాలు ఏర్పడిన ట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కూడా గంజాయి విక్రయాలు చేస్తున్న ట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వెలుగులోకి నమ్మలేని నిజాలు..
గంజాయి విక్రయాలపై పోలీసులకు దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వరుస దొంగతనాలపై దృష్టి పెట్టిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అయితే దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎ క్కువగా చదువుకుంటున్న యువకులే ఉండటం.. వారు గంజాయి మత్తులో దొంగతనాలు, గొడవలు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇటీవల మహబూబ్‌నగర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో దొంగతనాలపై ఓ యువకుడిని విచారిస్తున్న పోలీసులకు సదురు యువకుడు గంజాయికి అలవాటుపడినట్లుగా గుర్తించారు.
విక్రయాలపై పోలీసుల నిఘా..
గంజాయి ముఠాలు ఎక్కువయ్యాయి. కొన్ని ప్రాం తాలు, విద్యాసంస్థలే టార్గెట్‌గా విక్రయాలు చేస్తున్నారు. నల్లమల, కర్ణాటక ప్రాంతం నుంచే కాకుం డా గుంటూరు, ప్రకాశం, నల్లగొండ ప్రాంతాల నుంచి నాణ్యతలేని గంజాయిని సైతం తెచ్చి ఇక్కడ అమ్మి ఘటూ నషాళానికెక్కిస్తున్నారు.
నాలుగురు రిమాండ్..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను రెడ్‌హ్యండెండ్‌గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వీరితో 60 గ్రా ముల గంజాయి దొరికింది. విరిని విచారించగా దమాయిపల్లి కిశోర్ అనే వ్యక్తికి గంజాయి ఇవ్వడానికి వచ్చారు. ఈ గంజాయిని హన్వాడ మండలంలోని వేపూర్ తండాకు చెందిన కాడావత్ రాహుల్ వద్ద ప్రత్యేక అధికారులు తనిఖీలు చేయగా 290 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో కాడావత్ రాహుల్‌తోపాటు విక్రయిస్తున్న ఎండీ సల్మాన్, కోడి నరేశ్, కిశోర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి తెలిపారు. అయితే వీరి నుంచి మొత్తం 350 గ్రాము ల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.