వంగూరు, ఏప్రిల్ 20: సడెన్‌గా బైక్‌పై మంటలు రావడంతో ఆపే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి గాయాలైన ఘటన మండలంలోని శ్రీశైలం రోడ్డుపై వంగూరు గేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మొహిదీపట్నంకు చెందిన జునేద్(30), ఇమ్రాన్ బైక్‌పై అచ్చంపేటకు వస్తుండగా.. వంగూరు గేటు సమీపంలోకి రాగానే బైక్ పేలి మంటల వ్యాపించి కింద పడిపోయారు.
బైక్ నడుపుతున్న జునేద్ అక్కడికక్కడే మృతిచెందగా ఇమ్రాన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఇమ్రాన్ అరుస్తుండగా పక్కనే వెళ్తున్న వ్యక్తి జునేద్‌ను పక్కకు గుంజేశాడు. అప్పటికే అతడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కల్వకుర్తి దవాఖానకు తరలించారు. ఇమ్రాన్‌ను కూడా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.