అచ్చంపేటరూరల్, మే 5 : జిలాల్లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న (జీఏడీ డిస్పెన్షనరీ) 19 ఆయూష్ సెంటర్లు ఉన్న నిరుపేదలకు వైద్యం అందడం లేదు. ఆస్వస్థత యోగా కేంద్రాలు అనారోగ్యానికి నిలయాలుగా మారాయి. అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో స్వయంగా డాక్టర్లే ఎమ్మెల్యేలుగా ఉన్నా వీటిపై దృష్టి సారించకపోవడం విడ్డూరమని ప్రజలు వాపోతున్నారు. యోగా కేంద్రాలు నిర్మించినా అవి ప్రజలకు వినియోగంలోకి రాకపోవడం కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి చేసినా నిరుపయోగంగా మారాయి. శారీరక శ్రమలేకపోవడంతో చాలా మందికి చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ ఒత్తిడిబారీన పడుతున్నారు.
అలాంటి వారి కోసం జిల్లాలో 19 చోట్ల ఆయూష్ కేంద్రాలను ఏర్పాటు చేసినా వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లాలో నిరుపయోగంగా మారాయి. యోగా, ధ్యానంతో దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా జిల్లాలో ఆయుష్, హోమియోపతి, నాచురోపతి (డిస్పెన్సరీలు) దవాఖానలు ఉన్న చోట్ల యోగా కేంద్రాలను ఏర్పాట్లు చేయుటకు షెడ్లను నిర్మించుటకు నిధులను విడుదల చేసి షెడ్లను నిర్మించింది. అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం పట్టణంలోని వంద పడకల దవాఖాన సమీపంలో ఒకటి నిర్మించి వదిలివేయడంతో పందులు, కుక్కలకు నిలయాలు మారాయి.
మండలంలోని సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఒకటి యోగా కేం ద్రాన్ని నిర్మించి నిర్వహణ మరిచారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించి నిరుపయోగంగా ఉంచారు. ఒ క్కొక వాటి వ్యయం రూ.12 లక్షలు నేషనల్ ఆయు ష్ మిషన్ నిబంధనల ప్రకారం యోగా కేంద్రం షెడ్డు ఎనిమిది అడగుల వెడల్పు, 21 అడగుల పొడవుతో బాగా గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించాల్సి ఉన్నా అచ్చంపేటలో ఇరుకుగా ఉన్న దగ్గర అపరిశుభ్రమైన ప్రదేశంలో నిర్మించారనే ఆరోపణలున్నాయి. యోగా కేంద్రానికి వెళ్లి ఆయుష్ పెంచుకునేందుకు వెళ్లిన వారికి అక్కడి వాతావరణం చూసి లేని రోగాలను వెంట తెచ్చుకోవడం గ్యారెంటీ అని ఆం దోళన చెందుతున్నారు.
జిల్లాల్లో 19 డిస్పెన్షనరీ కేంద్రాల్లో కేవలం ఆరుగురు మాత్రమే రెగ్యులర్ డాక్టర్లు ఉన్నారు. మిగతా దగ్గర వీరే అదనంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు లేని కేంద్రాల వద్ద రోగులకు ఫార్మాసిస్టులు, అటెండర్లు మందులను పంపిణీ చేస్తున్నారు.
షుగర్, బీపీ, థైరాయిడ్, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వారికి యోగాకేంద్రాల్లో శిక్షకులతో యోగాసనాలు నేర్పించి,ఆరోగ్య సూత్రాలను వివరిస్తారు.
నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో 19 డిస్పెన్సరీ సెంటర్లల్లో ఆరోగ్య ఆస్వస్థత కేంద్రాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో నిర్మించారు. వాటి నిర్వహణకు యోగా శిక్షకులను నియమించుటకు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడంతోపాటు భర్తీకి చర్యలు తీసుకున్నది. ఒక్కొ కేంద్రంలో పురుష, మహిళ యోగా శిక్షకులు అవసరం డాక్టర్ల కొరతకు సంబంధించి అధికారులకు నివేదికను అందజేశాం.
– డాక్టర్ గోపాల్‌నాయక్, ఆయుర్వేదిక్ జోనల్ ఇన్చార్జి