పేదల భూములు గుంజుకునేందుకే హైడ్రా
పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ గ్రామంలో రైతులను బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి, పలువురు నాయకులతో కలిసి ఆమె పరామర్శించి మాట్లాడుతూ..
- ప్రభుత్వంపై సబితాఇంద్రారెడ్డి మండిపాటు
- బహదూర్‌గూడలోని రైతులు, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు కమ్మరి నర్సింహకు పరామర్శ
శంషాబాద్ రూరల్, జూలై 19 : పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ గ్రామంలో రైతులను బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి, పలువురు నాయకులతో కలిసి ఆమె పరామర్శించి మాట్లాడుతూ..హైదరాబాద్ చుట్టూ ఉన్న పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి ఎక్కడ పేదలకు చెందిన భూములు ఉన్నాయో అక్కడ వాలిపోయి పోలీసులను అడ్డుగా పెట్టుకొని భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
బహదూర్‌గూడలోని భూ ముల్లో రైతులు కొన్నేండ్లుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారని..వారి భూములను బలవంతంగా లాక్కొని ప్రభుత్వ భూ మిని కాపాడినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాను చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహదూర్‌గూడ రైతులు ఎవరూ అధైర్యపడొద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. పేద రైతుల భూములను బుల్లెట్ ట్రైన్ కోసం తీసుకుంటున్నట్టు చెప్పుకొంటున్న ప్రభుత్వం..ఆ టెర్నినల్ను బహదూర్గూడలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేటాయించిన భూమిలో ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. ఇక్కడి రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. నాదర్గుల్ గ్రామంలోని ప్రభుత్వ భూములను దర్జాగా కేబినెట్ మంత్రులు కబ్జా చేసి షెడ్లు నిర్మిస్తుంటే హైడ్రా కమిషనర్‌కు ఆ భూములు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. రానున్నది మన ప్రభుత్వమేనని.. కేసీఆర్ చేతుల మీదుగా బహదూర్‌గూడ రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ .. బహదూర్‌గూడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
రాత్రి సమయంలో కరెంట్ సరఫరా బంద్‌చేసి రైతులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, రాష్ట్ర నాయకుడు మంచర్ల శ్రీనివాస్, శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ ప్రదీప్‌రెడ్డి, కొత్వాల్‌గూడ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రావు, మాజీ జడ్పీటీసీ సతీశ్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, రాచమల్ల జయసింహ, గుంటిచరణ్, పరమేశ్వరి, రాజేందర్, వెంకట్‌రెడ్డి, కుమ్మరి అర్జున్, బక్క శ్రీకాంత్, రాహుల్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

