కోస్గి, ఫిబ్రవరి 11 : ఎల్లమ్మ తల్లీ కరుణించమ్మా.. మమ్మేలు తల్లీ.. అం టూ భక్తులు అమ్మను కొలిచారు. పో లేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం నిర్వహించారు. పూలతో అందంగా ము స్తాబు చేసిన తేరుపై అమ్మవారిని ప్ర తిష్ఠించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భాజాభజంత్రీలు.. భక్తుల కో లాహలం మధ్య తేరు ఉత్సవం జరిగింది. భక్తులు అమ్మవారి దర్శనంతో పరవశించిపోయారు. ఈ సందర్భం గా ఎల్లమ్మ నామస్మరణ మార్మోగింది. భక్తులు రథానికి బిందెలతో నీళ్లుపోసి పాడిపంటలు బాగా పండి గ్రామాలు సుభిక్షంగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.