కోస్గి, అక్టోబర్ 20 : పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని గుండమాల్, బాలభద్రయాపల్లి, హన్మన్పల్లి, మీర్జాపూర్, చెన్నారం, ముశ్రీఫా, నాచారం తదితర ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొన్నాళ్లుగా పనులు నత్తనడకన సాగ డం వల్లే నేటికి పూర్తి కాలేదన్నారు. సకాలంలో పనులు పూ ర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. పనులు నెమ్మదిగా చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. చెన్నారంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఉ పాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు అర్థం అవుతున్నా యా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. కోస్గి మున్సిపాలిటీ కార్యాలయం, తా సిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సి బ్బంది వివరాలు సేకరించి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉ న్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి శ్రీనివాసులు, ఆర్ఐ అమర్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, ప్రధానోపాధ్యాయులు, ఉ పాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల తనిఖీ
గుండుమాల్, అక్టోబర్ 20 : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలభద్రయాపల్ల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష గు రువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరై నిధులతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. నిర్మాణం ప నులను త్వరితగతిన పూర్తి చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. విద్యా ర్థులను దృష్టిలో పెటుటకొని పనులు చేయా లన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాముడు, ఎంపీపీ మధుకర్రావు, పీఏసీసీఎస్ డైరెక్టర్ నర్సింహులు గౌడ్, సీఅర్పీ దస్తయ్యగౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
త్వరగా పూర్తి చేయాలి
నారాయణపేట టౌన్, అక్టోబర్ 20 : పేట మున్సిపాలి టీ పరిధిలోని డంపింగ్ యార్డు పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణానికి సమీపంలో ఊట్కూర్ మండలం పగిడిమారి గ్రామ శివారులో రూ.4కోట్లతో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు పనులను గురువారం తనిఖీ చేశారు. త డి, పొడి చెత్తను వేరుగా చేసి సేంద్రియ ఎరువుగా మార్చేందుకు ఏర్పాటు చేస్తున్న వేర్వేరు షెడ్లను పరీశీలించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.