మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 29 : జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ కె.నర్సింహ అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్, టూటౌన్, రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లతోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ మాట్లాడుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు వచ్చేవారికి భరోసాగా నిలిచి వీలైనంత వరకు కుటుంబం కలిసేలా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ అధికారి చెప్పిన పనిని సకాలంలో పూర్తిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని చెప్పారు. ప్రతి వర్టికల్లో అందరూ అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడపాలని తెలిపారు.
అనంతరం జిల్లా పోలీసు వెల్ఫేర్ వింగ్స్ కన్జ్యూమర్ స్టోర్, యూనిట్ సురక్ష హాస్పిటల్, గ్యాస్ గోదాం, ఫ్యామిలీ క్వార్టర్స్‌ను ఎస్సీ సందర్శించి పరిశీలించారు. ఆరోగ్య సంరక్షణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్య అందించాలని కోరారు. మినరల్ వాటర్‌ప్లాంట్, స్టోరేజ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. గ్యాస్ గోదాంలో ఫైర్సేఫ్టి సక్రమంగా ఉందో లేదో రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసు లైన్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్ఐ వెల్ఫేర్‌ను సంప్రదించాలని సూచించారు.