మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 8 : అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఆదివారం ఎరుకల సంఘం రూపొందించిన నూత న సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఆ పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్ కల్పించినా అమలుకాలేదని, తెలంగాణ వచ్చాక ఎస్టీ ఎరుకల కులస్తులకు ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎరుకల కులస్తులు అభివృద్ధి చెందుతున్నార ని తెలిపారు.
రిజర్వేషన్ల పెంపుతో ఆదివాసీలు, గిరిజన, కో య, గోండ్రు, లంబాడీ కులాలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఏకలవ్య విద్యార్థి భవనం, ఎరుకల కమ్యూనిటీ భవన నిర్మాణానికి రెండెకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా ఆధ్యక్షుడు లాల్కోట శ్రీనివాస్, టీపీవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుతా డి కుమార్, శ్రీనివాసులు, సత్యనారాయణ, మహేందర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ సంఘం క్యాలెండర్..
జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట క్రాస్‌రోడ్డు సమీపంలో రూ.10లక్షలతో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంక న్న, కౌన్సిలర్ తిరుపతమ్మ, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నాందేవ్రావుకు నివాళి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 8: జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత క్యాషియర్ నాందేవ్రావు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అతడి స్వగృహానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా నాందేవ్రావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.