మక్తల్ : షాహిద్ భగత్ సింగ్ ( Bhagat Singh Statue ) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని పీవో డబ్ల్యూ ( POW ) రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. మే 5న మక్తల్ నారాయణపేట చౌరస్తాలో జరిగే షాహిద్ భగత్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
మక్తల్ నియోజకవర్గంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర శాఖ తరపు నుంచి మక్తల్ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి మహిళలకు అవగాహన కల్పించారు.
బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని, పోరాటమే మార్గమమని భావించిన భగత్ సింగ్, బ్రిటిష్ దొరలను గడగడలాడించారని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు శారద, జిల్లా సహాయ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి మహాదేవమ్మా , రాష్ట్ర సహాయ కార్యదర్శి సంధ్య, యూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు భుట్టో , పాటు తదితరులు ఉన్నారు.