కాసిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలు ఇచ్చి గౌరవిస్తుందని కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ( Ratnam Pradeep) అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మరావుపేట, కాసిపేట, తాటిగూడ, లంబాడీ తండా(డీ), రొట్టెపల్లి గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం అందించిన చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన చీరలతో డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుపైనే మంజూరు చేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రాజమౌళి, గ్రామ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, మాజీ సర్పంచ్ భూక్య రవి నాయక్, ఏపీఎం రాజకుమార్, సీసీ శారద, వీవోఏ సుగుణ, నవనందుల నీల, రుక్మిణి, రొట్టెపల్లిలో గ్రామ అధ్యక్షులు అల్క రాజు, మాజీ సర్పంచ్ కవిత, పెంద్రం హన్మంతు, కార్యదర్శి సౌందర్య తదితరులు పాల్గొన్నారు.