Lingala | లింగాల, జూన్ 10 : చెక్ డ్యామ్‌లో పడి మహిళ మృతి చెందింది. ఈ ఘటన లింగాల మండల పరిధిలోని చెన్నంపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లి గ్రామానికి చెందిన మల్లెపు సుజాత(43) అనే మహిళ గత శనివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అప్పాయపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న చెక్‌డ్యామ్‌లో మంగళవారం శవమై తేలింది. మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని చెక్‌డ్యామ్ నుంచి బయటకు వెలికితీశారు. మృతురాలిని చెన్నంపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. మృతురాలి భర్త సలేశ్వరం పదేండ్ల క్రితం మృతి చెందగా, వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.